May 15, 2026 10:27 pm

V1News Telangana

ముస్లిం సోదరులకు బ్లుమింగ్ బర్డ్స్ పాఠశాల ఇఫ్తార్ విందు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బ్లుమింగ్ బర్డ్స్ పాఠశాలలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఫయాజ్ అలీ మరియు ఇంచార్జి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

రమజాన్ నెల పవిత్రతను గుర్తు చేసుకుంటూ ముస్లిం సోదరులు ఉపవాస విరమణ (ఇఫ్తార్) చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొని పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజంలో సౌహార్ద్రత, ఐక్యత పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు పాఠశాల స్టాఫ్ స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

IRFAN Reporter
Author: IRFAN Reporter

Work from as a journalist

Leave a Comment

Read more
Read more