May 15, 2026 10:26 pm

V1News Telangana

ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ చేసిన వశిష్ట కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

.. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఉపయోగపడే A. COMPANION TO ENGLISH FOR BRILLIONCE అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని వశిష్ట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్ రచించారు. ఈ పుస్తకాన్ని శనివారం కళాశాలలో వశిష్ట కళాశాల డైరెక్టర్ వి .సత్యనారాయణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్టుపై మంచి పరిజ్ఞానాన్ని, సరళమైన భాషలో అందించడంలో విశేషంగా కృషిచేసిన రచయిత అఖిలేష్ కుమార్ సింగ్ ను అభినందించారు. విద్యార్థులు ఈ పుస్తకాన్ని పట్టుదలతో చదువుకొని పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని అన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సరోత్తమ్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more