మహారాష్ట్రకు తెలంగాణ ఇసుక భారీగా తరలింపు
రెచ్చి పోతున్న మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు
కొడిచెర్ల, సిరిపూరు, పొతంగల్ మంజీరా సరిహద్దు ప్రాంతం నుంచి మహారాష్ట్రకు జోరుగా ఇసుక తరలింపు
ప్రతిరోజు రాత్రి అయిందంటే ఇసుక భారీగా తరలింపు
గురువారం సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయిన అక్రమ ఇసుక మహారాష్ట్రకు తరలింపు
ప్రస్తుతం స్టార్ట్ అయిన ఇసుక తరలింపు మహారాష్ట్రకు రేపటి ఉదయం శుక్రవారం ఉదయం వరకు తరలిపోతూ ఉంటుంది

Ashok kamble రుద్రూర్ రిపోర్టర్:-

నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం కోడిచెర్ల, 331 ప్రభుత్వ మంజీరా సరిహద్దు ప్రాంతం తో పాటు, పొతంగల్ మంజీరా సరిహద్దు ప్రాంతం సిర్పూర్ మంజీరా సరిహద్దు ప్రాంతం కామారెడ్డి జిల్లా నుంచి ప్రతిరోజు రాత్రి అయిందంటే ఇసుక మద్నూరు, డోంగ్లి ,టాక్లి, మిర్జాపూర్ , దెగ్లూరు తోపాటు మహారాష్ట్రకు అదే విధంగా బీదర్ కర్ణాటక కూడా ఇసుక భారీగా తరలిపోతుంది, గురువారం సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అయిన ఈ ఇసుక తరలింపు శుక్రవారం మరుసటి రోజు ఉదయం వరకు తరలిపోతూ ఉంటుంది, గత ఐదు రోజుల క్రితం ఇసుక మాఫియా దారులు తమ వాహనాల ద్వారా కొడిచెర్ల శివారు ప్రాంతంలో ఓ రైతు యొక్క పంట పొలాలను ధ్వంసం చేసి, రౌడీయిజం చేస్తూ ఇసుకను మహారాష్ట్ర కు తరలించడం జరిగిందని, అడ్డుపడితే కత్తులతో బెదిరింపులు చేశారని ఈ ధాటికి భయపడి సదురు రైతు పరారీ అయినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇంటలిజెన్స్ ద్వారా ఎస్బి ద్వారా ఈ సమాచారం చర్యల కోసం ఇచ్చినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ మంజీర సరిహద్దు ప్రాంతంలో ఉన్న తెల్ల ఇసుకకు మహారాష్ట్రలో ,కర్ణాటకలో భారీ డిమాండ్ ఉంటుంది .అందుకే కర్ణాటక, మహారాష్ట్ర ఇసుక మాఫియా దారులు తెలంగాణ తెల్ల ఇసుకపై ఆధారపడి ఉంటారు. తెలంగాణ ఇస్కా పక్క రాష్ట్రాల్లో బంగారం లాగా కొలుస్తారు, అందుకే ప్రతిరోజు రాత్రి అయిందంటే మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులు ఇసుకను ప్రత్యేక వాహనాలా ద్వారా తరలిస్తారు అడ్డు వచ్చిన వారిపై కత్తులతో దాడులు చేయడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైన పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవడంలో జిల్లా స్థాయి అధికారులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మహారాష్ట్ర ఇసుక మాఫియాదారులకు తెలంగాణ రాష్ట్రంలోని మంజీరా సరిహద్దు ప్రాంతా గ్రామాల్లో ఉన్న కొంతమంది ఇసుక మాఫియా దారులు సపోర్టు చేయడం వల్లనే మామూలు తీసుకుంటూ జెసిబిల ద్వారా నింపుతూ ఇసుక మాఫియాకు తెర లేపుతున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.
గురువారం సాయంత్రం ఇసుక తరలిస్తున్న వైనం చిత్రాలు ఇలా ఉన్నాయి .ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








