May 15, 2026 11:54 pm

V1News Telangana

మేము దాడులు చెయ్యలేదు వారే మాపై దాడులు చేశారు గ్రామంలో చాటింపు వేయలేదు, గ్రామసభ పెట్టారు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గ్రామస్తులు హాజరుకాకుండానే గ్రామసభ మొదలుపెట్టారు

గతంలో జరిగిన అవినీతి అక్రమాలు బయట తీస్తామని భయపడి రాద్ధాంతం చేస్తున్నారు గొడవలు సృష్టిస్తున్నారు

అవినీతి అక్రమాల చిట్టా బయటపడనీయకుండా సమస్యను పక్కదోవ పట్టిస్తూ
అరాచకాలు సృష్టిస్తూ రౌడీయిజం చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు

కురుమ గంగారం అనే వ్యక్తి కుర్చీలో ఎందుకు కూర్చున్నారు అంటూ దాడి చేశాడు

నరేష్ అనే వ్యక్తి తమపై దాడి చేయడమే కాకుండా విచక్షణ రహితంగా కొరికిండు
కురుమ గంగారాం ఈశ్వర్ అనే వ్యక్తిపై విచ్చక్షణ రైతంగా దాడి చేశారు

రాయికూరు
రుద్రూరు

తాము ఎవ్వరిపై దాడులు చేయలేదని రౌడీయిజం కూడా చేయలేదని, తమపై కావాలని నిందలు వేస్తున్నారని గోవిందరావు పటేల్ , ఈశ్వర్ తో పాటు వినోద్ తదితరులు, కొంతమంది అన్నారు. గ్రామసభ ఉన్న విషయము గ్రామ ప్రజలకు ఎవరికీ చెప్పలేదని, గ్రామసభ ఉందన్న విషయం ఒకరోజు ముందు చెప్పాలని, దండోరా వేయాలని అలా చేయనికుండా ఉదయం 10 గంటలకు చెప్పి అప్పటికి అప్పుడే గ్రామ సభ ఏర్పాటు చేస్తే గ్రామ ప్రజలకు ఎలా తెలుస్తుందని వారు తెలిపారు, గ్రామసభలో ప్రజలు హాజరుకాకముందే గ్రామసభ మొదలుపెట్టడం ఏమిటి అని వారు ప్రశ్నించినట్టు తెలిపారు, గతంలో ఈ పాలకవర్గంలో ఉన్న కొంతమంది అవినీతి అక్రమాల ఆరోపణలు బాగానే ఉన్నాయని అవి ఎక్కడ బయట పెడతారు అని భయంతో సమస్యను పక్కదోవ పట్టించి , దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. గ్రామ సభ మొదలైనప్పుడు గోవిందరావు అను నేను లక్ష్మయ్య అను ఇరువురు కలిసి కుర్చీలో కూర్చోడం జరిగిందని అన్నారు, తమకు మోకాళ్ళ నొప్పులు ఇతర సమస్యలు ఉండడం వల్ల కింద కూర్చొలేని పరిస్థితి ఉంది కావున తాము కుర్చీ మీద కూర్చోడం జరిగిందని అన్నారు, తాము కుర్చీలో కూర్చున్న విషయాన్ని జీర్ణించుకోలేక కుర్మా గంగారం అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేసి కింద కూర్చోవాలని రౌడీయిజం చేయడం జరిగిందని వినకపోతే దాడులు చేయడానికి వచ్చారు అని పేర్కొన్నారు, ఆయనతోపాటు నరేష్ సైతం తమపై దాడులు చేయడం జరిగిందని వారితో పాటు కొంతమంది వచ్చి దాడులకు ఎత్నాలు చేసి తమల్ని గాయపరచడం జరిగిందని, రక్తపు మడుగులతో తాము ఇబ్బంది పాలు అయ్యామని తమపై దాడులు చేసి తిరిగి తామే దాడులు చేశామని అబద్ధం చెప్పడం ఎంతవరకు సమంజసం అని వారు తీరు మార్చుకోవాలని తెలిపారు. గ్రామ సభ నిర్వహించినప్పుడు ఒకరోజు ముందు చెప్పాలని గ్రామసభలో కుర్చీలు వేస్తే అందరికీ వేయాలని టెంటు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఈ విషయం చెప్పబోతే తమపై రౌడీయిజం చేసి దాడులు చేశారని అన్నారు. గ్రామ సభ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తే గ్రామస్తులంతా పట్టబోరని బయట టెంటు వేసి కుర్చీలు వేసి గ్రామసభ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పినందుకే తమపై దాడులు చేశారు అని అన్నారు. బోధన్ తో పాటు బాన్సువాడ పట్టణంలో మునిసిపల్ ఎన్నికలు ఉన్నందున మండల స్థాయి అధికారులు బుధవారం గ్రామసభ పెట్టొద్దని చెప్పినప్పటికీ గ్రామసభ కావాల నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అయితే ఇక్కడ ఎన్నికలు లేనప్పుడు గ్రామసభ నిర్వహిస్తే తమకేమీ అభ్యంతరం లేదని అయితే గ్రామసభ విషయం గ్రామస్తులకు ముందస్తుగా తెలియజేయకపోవడం దారుణం అని అన్నారు. మాకు తీవ్ర గాయాలు కావడం జరిగిందని అయితే తాము రుద్రూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినామని తమకు వారి వల్ల ప్రాణహాని ఉందని ,తమకు రక్షణ కల్పించాలని కోరటం జరిగింది. కావాలని గ్రామంలో అశాంతిత వాతావరణం నెలకొల్తున్నారని అన్నారు. చీటికిమాటికి తమతో గొడవలు పడుతూ గ్రామ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారని అన్నారు ,నరేష్ అనే వ్యక్తి ఓటమి జీర్ణించుకోలేకనే తమపై కక్ష సాధింపులు చేస్తున్నారని అన్నారు. తమకు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ తో ఏమి విభేదాలు లేవని కొంతమంది చేయడం వల్ల అశాంతిత వాతావరణం నెలకొంటుందని అన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more