V1News Telangana

best news portal development company in india

నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు: ఎమ్మార్వో శశిభూషణ్

SHARE:

ఇసుక మాఫియాపై కోరడా ఝుళిపిస్తున్న ఎమ్మార్వో శశిభూషణ్
రాత్రి–పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణాపై నిఘా
రికమండేషన్లు పనికిరావు… చట్టమే అంతిమం: సాలూర ఎమ్మార్వో
మంజీరా సరిహద్దులో ఇసుక మాఫియాకు షాక్

సాలూర:
నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మార్వో శశిభూషణ్ కఠిన చర్యలు చేపడుతూ ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని మందర్న గ్రామ మంజీరా సరిహద్దు ప్రాంతంతో పాటు ఇతర గ్రామాల సరిహద్దుల నుంచి అక్రమంగా ఇసుక తరలించేందుకు మాఫియా దారులు చేస్తున్న ప్రయత్నాలను ఎమ్మార్వో సమర్థవంతంగా అడ్డుకుంటున్నారని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
కొంతమంది అక్రమ రవాణాదారులు రాత్రి–పగలు తేడా లేకుండా అధికారుల కళ్లుగప్పి ఇసుక తరలించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎమ్మార్వో శశిభూషణ్ చాకచక్యంగా వ్యవహరిస్తూ అక్రమ ఇసుక రవాణాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ట్రాలీలతో గానీ, ట్రాక్టర్ల ద్వారా గానీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ఎప్పటికప్పుడు ప్రకటనలు, ప్రచారాల ద్వారా స్పష్టం చేస్తున్నారు.
అక్రమంగా ఇసుక తరలింపునకు పాల్పడితే ఎవరైనా సరే, ఎంతమంది వచ్చినా, ఎన్ని రికమండేషన్లు చేసినా, రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మార్వో స్పష్టంగా చెబుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. నిబంధనల అమలులో ఎలాంటి వెనుకంజ లేకుండా వ్యవహరిస్తున్న ఎమ్మార్వో వైఖరి వల్ల మండలంలో ఇసుక మాఫియా కార్యకలాపాలకు క్రమంగా కళ్లెం పడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india