కొత్తపేట దుబ్బా తండా–చే నంబర్ తండాలో పేకాట స్థావరాలు… అధికారుల నిశ్శబ్దం ఎందుకు?
పేకాట స్థావరాల్లో ‘సర్వం సిద్ధం’… పోలీసుల కళ్ళు మూసుకున్నాయా?
వ్యవసాయ భూముల్లో జూదం… చట్టం కనిపించడంలేదా?

నిజామాబాద్ జిల్లామోస్రా మండలం కొత్తపేట గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో పేకాట ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. దుబ్బా తండా, చే నంబర్ తండా గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు పేకాట స్థావరాలుగా మారినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
పేకాట స్థావరాలను ఆయా గ్రామాలకు చెందిన వ్యక్తులే నిర్వహిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా వివిధ పట్టణాలు, గ్రామాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పేకాట రాయలను కూడా పిలిపించి, భారీగా జూదం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేకాట స్థావరాల వద్దే భోజనం, మద్యం సహా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఆటలను జోరుగా కొనసాగిస్తున్నారన్న సమాచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ అక్రమ కార్యకలాపాలపై సంబంధిత అధికారులు, పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా స్పందిస్తారా? లేక ఎప్పటిలాగే మౌనంగా ఉంటారా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి ఉద్భవిస్తున్నాయి.
గ్రామ సరిహద్దుల్లో ఇలా బహిరంగంగా పేకాట దందా సాగుతుండటంతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పేకాట స్థావరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








