V1News Telangana

best news portal development company in india

ఛీ, చి, చి, ఇంత ఘోరమా వర్ని బస్టాండ్ లో సుమారు 5 బెల్ట్ షాపులు పట్టించుకోరా…

SHARE:

వర్ని బస్టాండ్ లో సుమారు 5 బెల్ట్ షాపులు పట్టించుకోరా

విద్యార్థులు బాలికలు, మహిళా ఆఫీసర్లు ఇతర ఆఫీసర్లు ప్రజలు, ప్రయాణికులు, వాహనపుదారులు నిత్యం తిరిగే ప్లేస్ లో బెల్ట్ షాపులు తాగుబోతులకు అడ్డగా మారిన బస్టాండ్ ప్రాంగణం

రాత్రి 12 నుంచి 1:00 వరకు ఉదయం 3 గంటల వరకు తెరుస్తున్న బెల్ట్ షాపులు అటువైపు కన్నెత్తి చూడని ఎక్సైజ్ శాఖ ఇతర శాఖ అధికారులు ఇంత అన్యాయమా ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యమా

వర్నిలోని వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులతో సిండికేట్గా ఏర్పడి జోరుగా బెల్ట్ షాపుల దందా

బెల్టు షాపులు ఊరులా ఉన్నాయి గల్లి గల్లి లో ఉన్నాయి దాని గురించి కాదు కేవలం వర్ని బస్టాండ్ లో ఉన్న ఐదు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోండి సుమ

ప్రజలు విద్యార్థులు ఆఫీసర్లు మనోవేదన పడుతుంటే ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నా కొంతమంది అధికారుల తీరుపై భగ్గుమన డమే కాకుండా ఛీ సిగ్గు లేదా వారికి అంటూ తిట్ల పురాణం చేస్తున్న ప్రజలు

వర్ని

నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం అనునిత్యం రద్దీగా ఉంటుంది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉంటుంది, బస్టాండ్లో మరుగుదొడ్ల సౌకర్యం లేక బస్టాండ్ ప్రాంగణంలో చెత్తా చదరం, మురికి వల్ల మనోవేదన గురవుతున్న ప్రయాణికులు, ప్రజలు మరోవైపు సుమారు బస్టాండ్ చుట్టుపక్కల ఐదు బెల్ట్ షాపులు ఉండడం పట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ,మహిళా, ప్రయాణికులు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్నిలోని వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులతో సిండికేట్ గా ఏర్పడి ఈ దందా జోరుగా నిర్వహిస్తున్నారని ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 నుంచి 1:00 వరకు బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని ఎంతోమంది మద్యం ప్రియులు ఇక్కడ మద్యం సేవించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఎక్కడబడితే అక్కడ పడిపోతున్నారని దీనివల్ల మహిళా ప్రయాణికులు బాలికలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఛీ వారి తీరు ఇక మారదు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు ఏగ్గు లేదు అంటూ ప్రజలు, మహిళా ప్రయాణికులు ఇతర ప్రజలు అధికారుల తీరుపై తిట్ల పురాణం చేస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణం నుంచి ఎమ్మార్వో ఆఫీసు, ఎండిఓ ఆఫీసు ,కాలేజీలు, పాఠశాలలు వసతి గృహాలు ప్రభుత్వ ఆసుపత్రులు అనునిత్యం ప్రభుత్వ కార్యాలయాలకు ఆఫీసర్లు ,మహిళా ఆఫీసర్లు వెళుతూ ఉంటారు వారికి సైతం ఇబ్బంది పాలుగా ఉన్నాయని వీటిపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు అధికారుల తీరుపై తిట్ల పురాణం బాగానే చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. గల్లీ, గల్లీలో ఊరు రా బెల్ట్ షాపులు ఉన్న మాట ప్రజలందరికీ తెలుసు దీనిపై చర్యలు తీసుకోరు అని కూడా ప్రజలకు తెలుసు ఆ మాట పక్కన పెడితే బస్టాండ్ ప్రాంగణంలో ప్రజలకు ప్రయాణికులకు బాలికలకు మహిళలకు ఇబ్బంది పాలు చేస్తున్న ఐదు బెల్ట్ షాపులను బంద్ చేయండి అంటూ ప్రజలు, మహిళా ప్రయాణికులు, విద్యార్థులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india