నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణానికి యత్నించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం 2004 సంవత్సరంలో అప్పటి బాజిరెడ్డి గారి హయాంలో అధికారికంగా కేటాయించబడినదిగా, భూమి పూజ కూడా నిర్వహించబడినదిగా దళిత సంఘాల నాయకులు తెలిపారు.

గత 20 సంవత్సరాలుగా ఈ స్థలంలో ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి, జెండా వందనం సహా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ విషయం గ్రామస్తులకు మరియు అధికారులకు పూర్తిగా తెలుసని వారు పేర్కొన్నారు. అయితే గత ఆరు నెలలుగా కొందరు వ్యక్తులు ఈ స్థలంలో అక్రమంగా షెడ్ లేదా బందుకు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
నిన్న సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు షెటర్లు, రేకులు తీసుకొచ్చి నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని ప్రశ్నించారు. మొదట ఎవరు నిర్మాణం చేస్తున్నారో తెలియదని చెప్పి, తర్వాత మోహన్ అనే వ్యక్తి పేరును వెల్లడించారని తెలిపారు. వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరడంతో పనులు ఆపివేశారని పేర్కొన్నారు.

ఈ ఘటనపై వర్ని పోలీస్ స్టేషన్ ఎస్సైకి ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామపంచాయతీ సెక్రటరీకి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గ్రామపంచాయతీ సెక్రటరీ కూడా ఈ స్థలం చరిత్ర తమకు తెలుసని, దళిత సంఘాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని కాపాడాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణ యత్నాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








