ఇస్సాపల్లి శివారులో పేకాట స్థావరంపై CCS మెరుపు దాడి – 9 మంది అరెస్ట్, నగదు స్వాధీనం
నిజామాబాద్, జనవరి 24:
గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, CCS ఏసీపీ ఇంచార్జ్ శ్రీ మస్తాన్ అలీ గారి సూచనలతో శుక్రవారం సాయంత్రం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లి శివారులో ఉన్న పేకాట స్థావరంపై CCS టీం మెరుపు దాడి నిర్వహించింది.
ఈ దాడిలో ఇన్స్పెక్టర్ డి. సాయినాథ్, ఎస్.ఐ. గోవింద్ మరియు సిబ్బంది పాల్గొని పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.54,070 నగదు, 10 సెల్‌ఫోన్లు మరియు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన వస్తువులు మరియు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








