May 16, 2026 5:45 am

V1News Telangana

ఇందూరు ప్రైమరీ హై స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఇందూరు ప్రైమరీ హై స్కూల్‌లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్య ప్రాముఖ్యత, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, మొబైల్ ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు, భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
సదస్సులో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను అవసరమైన మేరకే ఉపయోగించి, సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీ వెంకట్ నారాయణ, ఆర్టీవో సీఐ శ్రీనివాస్, ఎస్సై ప్రభాకర్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అలాగే ఇందూరు హై స్కూల్ ప్రతినిధి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రముఖులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more