May 16, 2026 5:43 am

V1News Telangana

ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి – RTOకి విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ పట్టణం మరియు డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ముఖ్యంగా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, వ్యాన్లు, టాటా ప్యాసింజర్ ఆటోలను నడపకుండా వెంటనే నిలిపివేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
ఈ రోజు బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ డి. నాగరాజ్, నాయకులు యన్. బాల్ రాజ్, తల్లారే సంజయ్, మావురం శ్రీకాంత్ లు మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు.
మార్చి 10 నుంచి జరగనున్న పరీక్షల్లో ర్యాంకులే లక్ష్యంగా పెట్టుకొని మాస్ కాపింగ్‌కు పాల్పడకుండా చూడాలని, నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఏ విద్యాసంస్థైనా మాస్ కాపింగ్‌కు పాల్పడితే విద్యార్థి సంఘాలుగా ఊరుకోబోమని స్పష్టం చేశారు.
సాయి ప్రసన్న హైస్కూల్ వ్యాన్ ప్రమాదాన్ని ఉదాహరణగా పేర్కొంటూ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు, వ్యాన్లు, టాటా ప్యాసింజర్ ఆటోల్లో విద్యార్థులను తరలించడాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఈ విషయంలో RTO అధికారులు వెంటనే స్పందించి అర్హతలేని వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో వెలుగులోకి తీసుకురావడానికి త్వరలో హైదరాబాద్‌లోని సమాచార హక్కు చట్టం కమిషనర్ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించి, బోధన్ పట్టణం మరియు డివిజన్ స్థాయిలోని అన్ని విద్యాసంస్థల పూర్తి వివరాలు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. అనంతరం తదుపరి కార్యాచరణను జేఏసీ ప్రకటిస్తుందని చెప్పారు.
విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి PF, హెల్త్ కార్డులు అమలు చేయడం, తరగతుల నిర్వహణలో పారదర్శకత, వాహనాల రిన్యువల్స్ వంటి అనేక అంశాలపై ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజు, గంగాప్రసాద్, ఉదయ్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more