ఆదివారం:13 జులై:2025. వి1 న్యూస్:-
టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం కోట శ్రీనివాసరావు కన్నుమూయడంతో, దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ –
“కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి.” అని పేర్కొన్నారు.
కోట శ్రీనివాసరావు నేటికీ అద్భుతమైన విలన్ పాత్రలతో పాటు, హాస్యభరితమైన రోళ్లలోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన విషయం విదితమే. సినీ రంగానికే కాదు, ప్రజా జీవితానికీ కోట గారి మృతి తీరని లోటని పలువురు ప్రముఖులు తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








