June 18, 2026 4:11 pm

V1News Telangana

పేకాట స్థావరంపై దాడి నిర్వహించిన పోలీసులు….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

– ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు, 9 మంది పరారీలో ఉన్నట్లు వివరణ

– రూ.1300 నగదు ,03 చరవాణిలు ,06 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ గ్రామంలో గల పల్లె ప్రకృతి వనంలో పేకాట నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు.. 9 మంది పరారీలో ఉన్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. వారి వద్ద నుండి రూ.1300 నగదు, మూడు చరవాణిలు, ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు వివరాలు వెల్లడించారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

Leave a Comment

Read more
Read more