V1News Telangana

best news portal development company in india

అంగరంగ వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు….

SHARE:

– ఘనంగా శ్రీ గోదాదేవి, రంగనాథ స్వామి వార్ల కల్యాణ మహోత్సవం

– పల్లకి సేవలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ శివారులో కొండపై వెలసిన తెలంగాణ తిరుమల దేవస్థానం (TTD) లో సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహించిన శ్రీ గోదా దేవి, రంగనాథ స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి పల్లకి సేవలో పాలుపంచుకొని దర్శించుకున్నారు.

స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంభు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india