ఆలయాలకు దారి ఇవ్వాలి గ్రామస్తులు సహకరించాలి.
లయాల కోసం సొంత స్థలాలను దానం ఇచ్చిన వారిని చూశాము, ఆలయ అభివృద్ధి కోసం ఆర్థిక సహాయాలు చేసిన వాళ్లను చూసాము. కానీ గుడి కోసం వదిలిన మూడు గజాల స్థలాన్ని ఆక్రమించుకొన్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నారు. ఆలయం గేట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం ఆరేపల్లి శివారులో చోటుచేసుకుంది,
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మా చారికి అరెపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివారులో సర్వే నంబర్ 243/A2, 243/A1 లో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఇదే సర్వే నంబర్లో
జిల్లా కేంద్రానికి చెందిన నజీయా సమీర్ కు చెందిన 3 ఎకరాల 1 గుంట వ్యవసాయ భూమిని ఉంది, అయితే
ఆ స్థలంలో విరిద్దరూ ఎల్లమ్మ ఆలయ నిర్మాణం చేసారూ, నిర్మాణ సమయంలో ఆ పక్క స్థలంలోనే స్వయంభూ శివలింగం, నంది విగ్రహాలు భూమిలో నుండి బయట పడ్డాయి, దింతో వాటికి సైతం ఎల్లమ్మ ఆలయం ముందు మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి అందులో స్వయంభూ లింగేశ్వర, నంది, శివలింగాలను ప్రతిష్టించారు. ఆ ఆలయాల దర్శనాలకు , బోనాలు తీసే సమయంలో గుడి ముందు రోడ్డు కావాలని కోరారు. వీరి వ్యవసాయ స్థలం పక్కనే సింగరాయపల్లి గ్రామానికి చెందిన మాధవ రెడ్డికి సంబంధించిన వ్యవసాయ స్థలం ఉంది. ఈ ముగ్గురి భూమిలోంచి మూడు గజాల దారి ఉంది, అయితే ఆ స్థలంలో నుండి రోడ్డు తీసుకోవడానికి కావాలనే మాధవ రెడ్డి అనుమతి ఇవ్వకపోగా వీరిపై దుర్భాషలడినట్టు తెలిపారు. 1992 వ సంవత్సరంలో వీరి మధ్య స్థలం విషయంలో గ్రామస్తుల సమక్షంలో 3 గజాలతో రోడ్డు తీసుకోవడానికి ఒప్పంద పత్రం రాసుకునట్టు తెలిపారు. తమ వ్యవసాయ స్థలంలో నిర్మించుకున్న గుడులకు వెళ్లేందుకు, బోనాలు తీసేందుకు వారి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం పత్రం ప్రకారం 3 గజలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







