బోధన్: ప్రజల భద్రత, సౌకర్యం కోసం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 24 గంటలు అందుబాటులో ఉండే పోలీస్ ఔట్‌పోస్ట్‌ను ఆదివారం ప్రారంభించారు. ACP బోధన్ శ్రీనివాస్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో ఈ ఔట్‌పోస్ట్‌ను ప్రారంభించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది భద్రతకు ఈ పోలీస్ ఔట్‌పోస్ట్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది.
ఈ కార్యక్రమంలో బోధన్ SHO వెంకటనారాయణ, రూరల్ CI విజయ్ బాబు, SI రామ్, డాక్టర్ రహీమ్, ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో పోలీస్ ఔట్‌పోస్ట్ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








