హైకోర్టు అనుమతులు మంజూరు.. ఆర్థిక అనుమతులు రాగానే నిర్మాణ పనులు…
బోధన్, అక్టోబర్ 2: బోధన్‌లో నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి హైకోర్టు అనుమతులు మంజూరైనట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. సుమారు రూ.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్‌తో న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.
గురువారం బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు దేశాయ్ మాట్లాడారు. బోధన్‌లో ప్రస్తుతం ఐదు కోర్టులు కొనసాగుతున్నప్పటికీ, తగిన భవన వసతులు లేక న్యాయవాదులు, కక్షిదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ సమస్యను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు లభించాయని చెప్పారు. ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక అనుమతులు మంజూరైన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

అదేవిధంగా ప్రస్తుత కోర్టు భవనంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.1 లక్ష నిధులు మంజూరైనట్లు తెలిపారు. నూతన కోర్టు కాంప్లెక్స్ అందుబాటులోకి వస్తే బోధన్‌లో న్యాయ సేవలు మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా అందే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన కోర్టు కాంప్లెక్స్‌కు అనుమతులు మంజూరు చేయడంలో సహకరించిన హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







