-- --

“బాలికల భద్రతకు భరోసా.. ఉచిత కరాటే శిక్షణ!”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బాలికల స్వీయ రక్షణకు ఉచిత కరాటే శిక్షణ

బోధన్, అక్టోబర్ 4: వెనుకబడిన తరగతుల బాలికల స్వీయ రక్షణ కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం బాలికల వసతి గృహంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కరాటే శిక్షణ ఇచ్చారు.

కరాటే శిక్షకురాలు, కార్యక్రమ చైర్మన్ లయన్ పుష్పలత (పల్లవి) స్వయంగా శిక్షణను నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఈ ఉచిత కరాటే తరగతులను కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ కుమ్మరిపోశెట్టి, డిస్ట్రిక్ట్ ఐ క్యాంప్ చైర్మన్ లయన్ గోవింద్ రెడ్డి, జోనల్ చైర్మన్ లయన్ సురాబత్తుని శ్రీనివాసరావు, లయన్ పుష్పలత (పల్లవి), బాలికల వసతి గృహం ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

 

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more