రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
సిరికొండ: మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ కార్యదర్శి వెలమ భాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ పీపావత్ లాస్కర్, సెంటర్ ఇన్‌చార్జ్ మాలావత్ సంతోష్ నాయక్, సంస్థ ఇన్‌చార్జ్ ప్రశాంత్ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ధోనీమోహన్, మెట్టుమర్రి తండా సర్పంచ్ కేతావత్ తిరుపతి, సీనియర్ నాయకులు గజనలాల్ నాయక్, వార్డు సభ్యులు రమేష్ నాయక్, నరేష్, సుభాష్, గంగాధర్, మోహన్‌లాల్, మున్సింగ్, మోతిసింగ్, పి. నరేష్‌తో పాటు గ్రామ రైతులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








