దళారులను నమ్మి మోసపోవద్దు.. డబ్బులు డిమాండ్ చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలి
బోధన్, అక్టోబర్ 2: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల విషయంలో లబ్ధిదారులు దళారులను నమ్మి ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని బోధన్ పట్టణ కాంగ్రెస్ నాయకులు సూచించారు. డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తుల వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
బోధన్ పట్టణంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ అంకుదాము, జిల్లా నాయకులు పాషా మొహీనుద్దీన్, ఫ్లోర్ లీడర్ తూము శరత్‌రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్ ఇమ్రాన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోధన్‌లో అర్హులైన నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పారదర్శకంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు ఆర్డీవో విజయకుమారి, సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో రిజర్వేషన్ల ప్రకారం లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

ఎంపికైన లబ్ధిదారులు దళారుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, ఎవరైనా ఇళ్ల కేటాయింపుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిరాశ్రయులకు బదులుగా గృహస్థులకు ఇళ్లు కేటాయించినట్లు అనుమానం ఉన్నా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.
కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని నాయకులు హెచ్చరించారు. ఆరు నెలల అనంతరం ఇళ్ల వినియోగాన్ని పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే పట్టా రద్దు చేసి మరో అర్హుడికి కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







