-- --

ఉపాధి హామీపై గ్రామసభలు….

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నీటి వృథాను అరికట్టాలి.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించాలి

సాలూర, అక్టోబర్ 2: సాలూర మండలంలోని వివిధ గ్రామాల్లో గ్రామ సర్పంచ్‌ల అధ్యక్షతన శుక్రవారం ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, నీటి సంరక్షణ అంశాలపై గ్రామసభలు నిర్వహించారు. ఇందులో భాగంగా మందర్న గ్రామపంచాయతీలో సర్పంచ్ రావు సావిత్రి గంగాధర్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది.

ఈ సందర్భంగా నీటిని వృథా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించాలని గ్రామస్తులతో పంచాయతీ పాలకవర్గం ప్రతిజ్ఞ చేయించింది. అనంతరం గ్రామపంచాయతీ కార్మికులను శాలువాలతో సన్మానించారు.

గ్రామంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించడం, ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం, ఇంటి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పంచాయతీ అందించే చెత్త బుట్టల్లో వేయడం వంటి అంశాలపై గ్రామసభలో తీర్మానాలు చేశారు. ఇళ్లలోని కుళాయిలకు ఆన్‌–ఆఫ్‌ నల్లాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

నీటిని నిర్లక్ష్యంగా వృథా చేస్తే పంచాయతీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని గ్రామస్తులకు హెచ్చరించారు. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపులో ఇంకుడు గుంతల ప్రాధాన్యతను వివరించారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాభివృద్ధికి అందుబాటులోకి వచ్చే నిధులను ఏయే పనులకు వినియోగించవచ్చో గ్రామ క్షేత్ర సహాయకుడు సాయిలు గ్రామసభలో వివరించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా పనులను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రావుబా గంగాధర్, మందర్న రవి, పంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

 మాట్లాడుతున్న పంచాయతీ కార్యదర్శి శిల్ప.గ్రామసభలో

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more