గాంధీ జయంతి సందర్భంగా సేవలను గుర్తించిన గ్రామపంచాయతీ పాలకవర్గం…
బోధన్, అక్టోబర్ 2: నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి, వారి సేవలను అభినందించారు.
గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికులకు బట్టలు, షూస్, గ్లౌజులు, సబ్బులు, సర్ఫ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్మికుల సంక్షేమం, పారిశుద్ధ్య నిర్వహణలో వారి పాత్రను ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ప్రతినిధులు కొనియాడారు.
అనంతరం గ్రామంలో ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న ఉపాధి హామీ పనుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, గ్రామ అవసరాలపై గ్రామస్థులతో చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి సాటాపూర్ సాయిలు, గ్రామ పెద్దలు, గ్రామస్థులు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







