-- --

పారదర్శకంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు అధికారుల సమక్షంలో వార్డుల వారీగా లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, సెప్టెంబర్ 30: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పారదర్శకంగా నిర్వహించారు. చైర్మన్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంఆర్‌ఓ, హౌసింగ్‌ ఈఈతో పాటు కౌన్సిలర్ల పర్యవేక్షణలో వార్డుల వారీగా లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
మొత్తం 384 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు గాను ప్రస్తుతం 294 ఇళ్లకు మాత్రమే డ్రా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం, ఇతరులకు 65 శాతం చొప్పున కేటాయింపులు చేపట్టినట్లు పేర్కొన్నారు.


మిగిలిన ఇళ్లను మున్సిపల్‌ కార్మికులు, జాతీయ రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితుల కోసం రిజర్వ్‌లో ఉంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు తెలిపారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more