-- --

సీఎం ప్రవాసీ ప్రజావాణి వేదికపై గల్ఫ్ సామాజిక సేవకులకు సత్కారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రవాస సంఘాలు, సామాజిక సేవకుల సేవలు అభినందనీయం..

హైదరాబాద్, సెప్టెంబర్ 29: గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి సామాజిక సేవకులు, ప్రవాస సంఘాలు అందిస్తున్న సేవలను రాష్ట్ర ప్రభుత్వం అభినందించింది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ 258వ సెషన్‌లో గల్ఫ్ సామాజిక సేవకులు పొన్నం సత్యనారాయణ (దుబాయి), సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (సాటా) రియాద్ ప్రతినిధి ఖాజా ముజాములుద్దీన్లను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్‌పర్సన్, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి గద్వాల్ విజయలక్ష్మి, స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. విదేశాల్లో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికులు అనేక సందర్భాల్లో ఎదుర్కొనే అత్యవసర, న్యాయపరమైన, సామాజిక సమస్యల పరిష్కారంలో స్థానికంగా పనిచేస్తున్న సామాజిక సేవకులు, ప్రవాస సంఘాల సహకారం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లతో సమన్వయం చేస్తూ వారికి అవసరమైన సహాయాన్ని అందించడం అభినందనీయమన్నారు.

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ వాసులకు అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైన సందర్భాల్లో కుటుంబ సభ్యులతో సమన్వయం చేయడం వంటి సేవల్లో ప్రవాస సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ద్వారా విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రవాసులు, గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సామాజిక సేవకులు మరియు ప్రవాస సంఘాలతో సమన్వయం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సీఎం ప్రవాసీ ప్రజావాణి లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్లు గంగుల మురళీధర్ రెడ్డి, మహమ్మద్ బషీర్ అహ్మద్, కె.పి. మహేష్ తదితరులు పాల్గొన్నారు.

(Government of Telangana – State-Level CM Pravasi Prajavani, Session No. 258, మంగళవారం, 29.09.2026)

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more