బోధన్, సెప్టెంబర్ 30: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా బోధన్ డివిజన్ వయోవృద్ధుల సంక్షేమ ఫోరం ఆధ్వర్యంలో పలువురు వయోవృద్ధులు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సమాజానికి విశిష్ట సేవలందించిన పలువురు సీనియర్ సిటిజన్లు, ఉపాధ్యాయులను సత్కరించినట్లు పేర్కొన్నారు.
వయోవృద్ధుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం, వారి సమస్యలపై అవగాహన కల్పించడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, డీటీఓ నాగేశ్, పట్టణ సీఐ వెంకటనారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రాజేశ్వర్, సత్యనారాయణ, విఠల్ రావు, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







