అదనపు బస్సు ఏర్పాటు చేయాలని డిమాండ్.. పోలీసుల హామీతో విరమించిన ధర్నా….
సాలూర, సెప్టెంబర్ 30 (వి.1 న్యూస్):
సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామం వద్ద విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం బుధవారం ఆందోళనకు దిగారు. సుంకిని నుంచి సాలూర మీదుగా బోధన్ తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిపడా లేకపోవడంతో ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయాల్లో బస్సుల కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సి వస్తోందని, బస్సులు వచ్చినప్పుడు అధిక రద్దీ కారణంగా ప్రయాణం కష్టంగా మారుతోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులు ఖాజాపూర్ వద్ద ఆర్టీసీ బస్సును అడ్డుకుని, బస్సు ముందు కూర్చొని నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థుల సమస్యను సంబంధిత ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, డీఎంతో మాట్లాడి అదనపు బస్సు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సుంకిని–సాలూర మార్గంలో ఉదయం, సాయంత్రం విద్యార్థుల రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపాలని స్థానికులు, విద్యార్థులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







