-- --

సాలూర క్యాంపులో పౌర హక్కుల దినోత్సవం ఎస్సీ, ఎస్టీల హక్కులు.. చట్టాలపై అవగాహన కల్పించిన అధికారులు…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర క్యాంపులో పౌర హక్కుల దినోత్సవం

ఎస్సీ, ఎస్టీల హక్కులు.. చట్టాలపై అవగాహన కల్పించిన అధికారులు

సాలూర, సెప్టెంబర్ 30 (వి1 న్యూస్):
సాలూర మండలంలోని సాలూర క్యాంపులో బుధవారం పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలు, ఎస్సీ, ఎస్టీ  చట్టంపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖకు చెందిన హాస్టల్ వెల్ఫేర్ అధికారి, సర్పంచ్, రూరల్ ఎస్సై, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, అవమానకర ప్రవర్తన, హక్కుల ఉల్లంఘన వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు, సామాజిక న్యాయం, రక్షణలు తదితర అంశాలను వివరించారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులు, వివక్ష లేదా వేధింపులకు పాల్పడితే సంబంధిత అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు.

కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రజలు తమ హక్కులను సమర్థవంతంగా కాపాడుకోవచ్చని తెలిపారు. పౌర హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more