భక్తిశ్రద్ధలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు.. భారీగా అన్నదానం
బోధన్, సెప్టెంబర్ 29 (V1 న్యూస్): బోధన్ పట్టణ బైపాస్ రోడ్డు సమీపంలోని బొర్ర గణపతి ఆలయంలో అంగారక చతుర్థిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు నిర్వహించారు.
అంగారక చతుర్థి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి బొర్ర గణపతిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంగళహారతి స్వీకరించి, తీర్థప్రసాదాలను పొందారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







