ఇథనాల్ దెబ్బ 👊 సుగర్ అబ్బా ..😳 🎋
రూ. Kg 40 ఉన్న సుగర్ రూ. Kg 65 కు చేరింది
భారీగా పెరుగుతున్న చక్కెర ధరలు.. కారణమిదే!

దేశంలో చక్కెర ధరలు రికార్డు స్థాయిలో
పెరుగుతున్నాయి. ఎగుమతులు నిలిపేసినా, తగినంత
చెరకు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో కొరత ఉంది.
ఇథనాల్(E20) ఉత్పత్తి కోసం చెరకు పంట డైవర్ట్
అవుతుండటమే ఇందుకు కారణమని నిపుణులు
చెబుతున్నారు. దీంతో ప్రస్తుతమున్న 100% ఇంపోర్ట్
డ్యూటీని ఎత్తేసి చక్కెర దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని Reuters పేర్కొంది.
కగా దేశంలో ఈనెల్లోనే 50% రేట్ పెరగడం గమనార్హం.
🎋 భారీగా పెరిగిన చక్కెర ధరలు 💰
నిన్న దేశవ్యాప్తంగా మిల్లుల వద్ద 100 KGల చక్కెర ధర రూ.5,400-రూ.5,500 వరకు పలికింది. ఏడాది క్రితం రూ.3,900గా ఉండేదని మార్కెట్ వర్గాలు చెప్పాయి. ఇంధనాల్ వల్ల వచ్చే ఏడాది నిల్వలు తగ్గొచ్చనే అంచనాలే కారణమని తెలుస్తోంది. అటు AUG-NOV వరకు పండగల డిమాండ్‌కు తగ్గట్టుగా దిగుమతులపై టారిఫ్ ఎత్తేయడంతో పాటు భారీ నిల్వలపై కేంద్రం ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. కాగా రిటైల్ మార్కెట్లో క్వాలిటీని బట్టి KG చక్కెర రూ.60-65గా ఉంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







