-- --

సాలూర మండల పీఆర్‌టీయూ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

అధ్యక్షుడిగా కల్లూర్ శంకర్.. ప్రధాన కార్యదర్శిగా సింగారి లక్ష్మణ్

సాలూర, ఆగస్టు 20:
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్‌టీయూ) సాలూర మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం బలోపేతం, ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.

అధ్యక్ష పదవికి జరిగిన హోరాహోరీ పోటీలో కల్లూర్ శంకర్ డ్రా పద్ధతి ద్వారా విజయం సాధించారు. మిగిలిన పదవులకు నాయకులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శిగా సింగారి లక్ష్మణ్, అసోసియేట్ అధ్యక్షులుగా జి. గోవర్ధన్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా డి. సుధారాణి బాధ్యతలు స్వీకరించారు.

ఉపాధ్యక్షులుగా ఎం.డి. ఫక్రుద్దీన్, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె. జ్యోతి, కార్యదర్శిగా కె. శ్రీనివాస్, మహిళా కార్యదర్శిగా టి. ప్రమీల ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల కార్యక్రమానికి పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పి. మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఐక్యంగా కృషి చేయాలని సూచించారు. నూతన కార్యవర్గం ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం సమష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో ప్రచార కమిటీ కన్వీనర్ జి. రవీందర్‌రెడ్డి, మాజీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు ఎ. శంకర్, బోధన్ అధ్యక్షుడు థామస్, పోతంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బోధన్ అర్బన్ అధ్యక్షుడు కైరాన్, ప్రధాన కార్యదర్శి గంగాధర్‌తో పాటు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు, సాలూర మండల పీఆర్‌టీయూ సభ్యులు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సంఘ నాయకులు, ఉపాధ్యాయులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయుల ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ నూతన కార్యవర్గం మండలంలో సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more