బోధన్, ఆగస్టు 5: బోధన్ మండలంలోని నగణపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.2,480 నగదును స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వారిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును సీజ్ చేసి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. జూద కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








