ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. ఇద్దరు చిన్నారులు కూడా మృతి
సిద్దిపేట జిల్లా, ఆగస్టు 20: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటంతో బల్వంతపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బల్వంతపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తుండగా, ఆయన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్స్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి సిద్దిపేటలో బంధువు దశదిన కర్మకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అప్పన్నపల్లి గ్రామ శివారుకు చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.
కొంతసేపటి తర్వాత ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది, స్థానికుల సహాయంతో క్రేన్ ద్వారా కారును బావిలో నుంచి బయటకు తీశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రాజు, భాగ్యతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







