సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారన్న ఆరోపణలు
నిర్మల్ జిల్లా, ఆగస్టు 20: సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖానాపూర్ మండలం సత్తెనపల్లిలో రేఖా నాయక్ పేరుతో ఉన్న ఏఆర్‌ఎస్ రైస్ మిల్లులో భారీగా ధాన్యం లెక్కల్లో తేడాలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
మూడు రబీ సీజన్లకు సంబంధించిన సుమారు రూ.40 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, దాన్ని లెక్కల్లో చూపకుండా పక్కదారి పట్టించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా సంబంధిత రైస్ మిల్లులో పౌరసరఫరాల శాఖ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యాన్ని లెక్కల్లో నమోదు చేయకుండా మళ్లించడం ద్వారా ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసినట్లు అధికారులు నివేదిక రూపొందించినట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖానాపూర్ పోలీసులు క్రైమ్ నంబర్ 165/2026 కింద కేసు నమోదు చేశారు.

ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ వివరాలు, ప్రభుత్వ రికార్డులు, లెక్కల్లో చూపిన పరిమాణాలపై అధికారులు మరింతగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







