బోధన్, జూలై 21 (వి1 న్యూస్):
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటితో సాగయ్యే లాభసాటి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.
మంగళవారం బోధన్ నియోజకవర్గంలోని ఫకీరాబాద్ నుంచి ఆచన్‌పల్లి వరకు రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల నుంచి ప్రధాన డబుల్ లైన్ రోడ్లకు అనుసంధానంగా మరో రూ.16 కోట్లతో రహదారి అభివృద్ధి పనులను త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

విద్యా రంగంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్యను అందించేందుకు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంస్థలో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక విద్యా సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, మాజీ అధ్యక్షుడు పాషా, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








