-- --

బోధన్‌లో భక్తిశ్రద్ధలతో ఘనంగా వరుణ మహా యాగం సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

వర్షం వరమైతే… రైతు ముఖంలో చిరునవ్వు చిరస్థాయి.”

బోధన్, జూలై 3: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ బోధన్ పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహారాజ్ ఆధ్వర్యంలో వరుణ మహా యాగం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ మహాయాగం బాసరకు చెందిన వేదభారతి విద్యాపీఠం వేదపండితులు, శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ ఆశీర్వచనాలతో వైదిక సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞయాగాదులు నిర్వహించి వరుణ దేవునికి విశేష ఆరాధనలు చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురిసి వ్యవసాయం అభివృద్ధి చెందాలని, ప్రకృతిలో సమతుల్యత నెలకొనాలని, రైతుల కష్టాలు తొలగి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని యాగంలో సంకల్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామీజీ భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు.

వరుణ మహా యాగం విజయవంతానికి సహకరించిన వేదపండితులు, సేవకులు, దాతలు, భక్తులకు ధారణ ఫౌండేషన్ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more