సాలూర, జూన్ 27: సాలూర మండల కేంద్రంలో మొహర్రం పీర్ల పండుగను శనివారం భక్తిశ్రద్ధలతో, మత సామరస్య వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగే ఈ వేడుకలో కుల, మత భేదాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సోదరభావాన్ని చాటారు.
కర్బలా యుద్ధంలో ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన హజ్రత్ ఇమామ్ హసన్, హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రం పండుగను నిర్వహిస్తారు. ఐదు రోజుల పాటు పీర్ల బంగ్లాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు సంప్రదాయబద్ధంగా షర్బత్ పంపిణీ చేశారు.
ఆరవ రోజు నాలే హైదర్ బంగ్లా నుంచి ప్రారంభమైన పీర్ల ఊరేగింపు సాలూర ప్రధాన వీధుల గుండా భక్తి వాతావరణంలో సాగి, అనంతరం మౌలాలి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ సంప్రదాయం ప్రకారం రెండు పీర్లు “అన్నదమ్ముల కలయిక”కు ప్రతీకగా అలై-బలై చేసుకోవడంతో మొహర్రం వేడుకలు ముగిశాయి.

గ్రామ పెద్దలు, మత పెద్దలు, యువకులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. త్యాగం, శాంతి, సోదరభావం, మానవత్వం అనే సందేశాన్ని చాటుతూ సాలూరలో మొహర్రం పండుగ మరోసారి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








