June 26, 2026 11:30 pm

V1News Telangana

ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల అమ్మకాలపై బోధన్ విద్యార్థి జెఎసి తీవ్ర ఆగ్రహం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ జూన్ 26 : బోధన్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల అమ్మకాలు నిర్వహిస్తున్నా వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల JAC డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల JAC ఆధ్వర్యంలో శుక్రవారం PRTU భవన్ లో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో విచ్చలవిడిగా పాఠ్యపుస్తకాలు, బుక్ డిపో కి సంబంధించిన స్టేషనరీ, యూనిఫామ్ అమ్మడం సిగ్గుచేటు అన్నారు. విద్యాశాఖ అధికారులు స్కూల్స్ లలో కానీ స్కూల్ యొక్క ప్రాంతంలో గాని బుక్స్ గాని స్టేషనరీ అమ్మద్దు అని చెప్పినప్పటికీ వారి మాటలను పట్టించుకోకుండా యదేచ్ఛగా విక్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి బలవంతంగా బుక్స్ పేరుతో అడ్మిషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బోధన్ లో కొన్ని పాఠశాలలో సరైన సౌకర్యాలు లేకున్నా మండల విద్యాధికారి కనీసం అటువైపు చూడకుండా నిమ్మకు నీరుతున్నట్టుగా వ్యవహారిస్తున్నారు. ఇలాంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షాన విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి ఆందోళన కార్యక్రమాలకు వెనకడుగు వేయబోమని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల JAC చైర్మన్ డి. నాగరాజు, నాయకులు యన్. బాల్ రాజ్,మావురం శ్రీకాంత్, ప్రశాంత్, కిరణ్, రాజన్న, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Naveen Naveen
Author: Naveen Naveen

Leave a Comment

Read more
Read more