June 25, 2026 11:19 pm

V1News Telangana

చెక్కిక్యాంప్‌లో ఘనంగా శ్రీ శివపంచయతన అభయ ఆంజనేయ స్వామి 10వ వార్షికోత్సవ వేడుకలు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 25:

బోధన్ మండలంలోని చెక్కిక్యాంప్‌లో కొలువై ఉన్న శ్రీ శివపంచయతన అభయ ఆంజనేయ స్వామి దేవాలయం 10వ వార్షికోత్సవ మహోత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉదయం 6 గంటల నుంచే ఆలయ ప్రాంగణం వేదమంత్రోచ్ఛారణలతో మార్మోగింది. ఆలయ అర్చకులు గణపతి పూజ, రక్షా కంకణ ధారణ, మండపారాధన కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం పంచపాలక, నవగ్రహ, అష్టదిక్పాలక హోమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు.

తదనంతరం శ్రీ అభయ ఆంజనేయ స్వామివారికి లక్ష తమలపాకుల పూజ, ప్రధాన కలశ పూజ, విశేష అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక ఆరాధనలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.

వేడుకల సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాప్రసాద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఆధ్యాత్మిక భక్తి, సంప్రదాయ వైభవం, భక్తుల విశేష పాల్గొనికతో చెక్కిక్యాంప్‌లో నిర్వహించిన శ్రీ శివపంచయతన అభయ ఆంజనేయ స్వామి 10వ వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more