June 25, 2026 11:19 pm

V1News Telangana

విద్యుత్ అంతరాయాల నివారణకు కృషి చేసిన లైన్‌మన్ శివకు ఘన సన్మానం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 25:

బోధన్ పట్టణంలోని 15వ వార్డులో విద్యుత్ సరఫరా అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించిన విద్యుత్ శాఖ లైన్‌మన్ శివను స్థానిక ప్రజలు ఘనంగా సన్మానించారు.

విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తాకడంతో తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో, లైన్‌మన్ శివ ప్రత్యేక చొరవ తీసుకుని చెట్ల కొమ్మలను తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. దీంతో విద్యుత్ సరఫరా సజావుగా కొనసాగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ సందర్భంగా 15వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గుమ్మాల అశోక్ రెడ్డి శివకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించడంలో లైన్‌మన్ శివ ఎల్లప్పుడూ ముందుంటారని, విద్యుత్ సేవల మెరుగుదలకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని ఆయన అన్నారు. స్థానికులు కూడా శివ సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులోనూ ఇదే విధమైన సేవా భావంతో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు మరియు విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more