June 25, 2026 11:20 pm

V1News Telangana

బోధన్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ ఎన్యుమరేషన్ ప్రారంభం. వారం రోజుల వరకు ఇంటింటా ఫారాల పంపిణీ – పూర్తి వివరాలు నమోదు చేయాలని తహసీల్దార్ విట్టల్ సూచన..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్, జూన్ 25:

భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బోధన్ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటర్ ఎన్యుమరేషన్ (సర్వే) ప్రక్రియ గురువారం ప్రారంభమైనట్లు తహసీల్దార్ విట్టల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఓటరుకు రెండు ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ స్థాయి అధికారుల (బి.ఎల్.ఓలు) ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆర్పీలు బి.ఎల్.ఓలుగా ఇంటింటికి వెళ్లి ఫారాలను అందజేస్తారని, వారం రోజుల తర్వాత తిరిగి వచ్చి వాటిని సేకరిస్తారని తెలిపారు.

ఓటర్లు ఫారాల్లో తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. మ్యాపింగ్ కాని వారు కూడా తమ పరిధిలోని బి.ఎల్.ఓలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎన్యుమరేషన్ ఫారం వెనుక సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా జతచేసి బి.ఎల్.ఓలకు అందజేయాలని పేర్కొన్నారు.

అలాగే, 2002 ఓటర్ల జాబితాలో పేరు లేని వారు కూడా అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఫారాల పంపిణీ ప్రక్రియను రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

జూన్ 25 నుంచి జూలై 24, 2026 వరకు నిర్వహించే ఈ ప్రత్యేక ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ప్రతి ఓటరు చురుకుగా పాల్గొని, ఫారాలను సకాలంలో పూర్తి చేసి తిరిగి అందజేయాలని తహసీల్దార్ విట్టల్ విజ్ఞప్తి చేశారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బి.ఎల్.ఓలు, బి.ఎల్.ఓ సూపర్వైజర్లు, తహసీల్దార్ కార్యాలయం లేదా హెల్ప్ డెస్కును సంప్రదించాలని సూచించారు.

బోధన్ నియోజకవర్గంలో ప్రత్యేక ఓటర్ ఎన్యుమరేషన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వివరాలు వెల్లడిస్తున్న తహసీల్దార్ విట్టల్.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more