Post Views: 14
సాలూరాలో చెరువు మట్టి దందా జోరు!
నాలుగు జేసీబీలతో తవ్వకాలు…

అధికారుల అనుమతులు ఎక్కడ?
నిజామాబాద్ జిల్లా సాలూరా గ్రామంలో చెరువు మట్టి అక్రమ తవ్వకాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు జేసీబీలతో భారీ స్థాయిలో చెరువు మట్టిని తవ్వి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
చెరువు మట్టి తరలింపునకు ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖలు, గ్రామపంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉండగా, సంబంధిత అనుమతులు పొందారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక అనుమతులు లేకుండానే ఈ తవ్వకాలు సాగుతున్నాయా అనే ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి.
స్థానికులు మాట్లాడుతూ, “సాధారణ రైతు చిన్న పని చేసినా నిబంధనలు చూపించే అధికారులు, భారీ స్థాయిలో జరుగుతున్న ఈ తవ్వకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ మట్టి దందా నిర్భయంగా కొనసాగుతోందా? అనే సందేహాలు కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజా ఆస్తిగా ఉన్న చెరువును కొందరి లాభాల కోసం దోచుకుంటున్నారా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల ప్రశ్నలు
చెరువు మట్టి తవ్వకాలకు అధికారిక అనుమతులు ఉన్నాయా?
రోజుకు ఎన్ని ట్రాక్టర్ల మట్టి తరలిస్తున్నారు?
ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఎంత?
సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేశారా?
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎప్పుడు?
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







