May 2, 2026 5:40 pm

V1News Telangana

తెలంగాణ మంజీరా సరిహద్దులో మహారాష్ట్ర ఇసుక మాఫియా దందా..!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలుర మండలం తెగెళ్లి శివార్లలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
రాత్రివేళ తెలంగాణ భూభాగంలోకి చొరబాటు – జేసీబీలతో ఇసుక దోపిడి
నోటీసులు ఎక్కడ..? సర్వేలు ఎప్పుడు..? అధికారులు మౌనం ఎందుకు..?

బోధన్, మే 1:
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలోని సాలుర మండలానికి ఆనుకుని ఉన్న తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సాలుర మండలంలోని సరిహద్దు గ్రామం తెగెళ్లి సమీపంలో మహారాష్ట్ర వైపు గల గంజగావ్ ప్రాంతానికి చెందిన మాఫియా గుంపులు తెలంగాణ భూభాగంలోకి చొరబడి అక్రమంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు, ఇక్కడ కూలీలతో కాకుండా జేసీబీ యంత్రాలతో భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో తెలంగాణ భూభాగంలోకి చొరబడి తవ్వకాలు జరిపి, రాత్రింబవళ్లు వాహనాల్లో ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తెలంగాణ సహజ వనరులు బహిరంగంగా దోచుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం గ్రామస్తులు ఈ అక్రమ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టినట్లు తెలిసింది. అయితే సర్వేలు చేసి వెళ్లిపోవడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు.

నోటీసులు ఎప్పుడు..? చర్యలు ఎప్పుడు..?
అక్రమ తవ్వకాలు బహిరంగంగా కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సమగ్ర సర్వే చేపడతామని చెప్పిన అధికారులు ఇప్పటికీ ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
అక్రమ తవ్వకాలపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు..? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
అధికారులపై అనుమానాల మబ్బులు
ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కూడా కుమ్మక్కై ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తవ్వకాల వీడియోలు తీయడానికి ప్రయత్నించిన వారిని బెదిరిస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన కొందరు అధికారులు మాఫియా గుప్పెట్లోనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తుండగా, కొందరు తెలంగాణ అధికారులు కూడా వారికి అమ్ముడుపోయారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పై అధికారులు వెంటనే స్పందించాలి..!
తెలంగాణ భూభాగంలో సహజ వనరులను ఈ విధంగా దోచుకుంటుంటే ఇకనైనా పై అధికారులు స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే కేసులు నమోదు చేసి, జేసీబీలు స్వాధీనం చేసుకుని, సమగ్ర సర్వే చేపట్టి నోటీసులు జారీ చేయాలని కోరుతున్నారు.
లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more