April 24, 2026 6:03 pm

V1News Telangana

బోధన్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్‌పై అవగాహన సదస్సు నిర్వహణ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లైన్స్ క్లబ్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ (Self Enumeration) పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ, దాని ప్రాధాన్యం గురించి వివరించారు.


అధికారులు వెల్లడించిన ప్రకారం, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ గడువులోపు వివరాలను నమోదు చేసుకుంటే, తదుపరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించుకోవచ్చని తెలిపారు.
ఈ అవగాహన సదస్సులో వార్డ్ ఆఫీసర్లు, ఐకేపీ (IKP) సిబ్బంది, మెప్మా (MEPMA) సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. తమ పరిధిలోని ప్రజలకు ఈ సమాచారాన్ని విస్తృతంగా చేరవేయాలని వారు నిర్ణయించారు.
అలాగే, ఎవరికైనా సందేహాలు ఉంటే తమకు సంబంధించిన వార్డ్ ఆఫీసర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేస్తే, తదుపరి ఎన్యూమరేషన్ సమయంలో సమయం ఆదా అవుతుందని తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more