May 15, 2026 6:33 pm

V1News Telangana

చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది గైర్హాజరు – అక్రమ ఇసుక రవాణాకు మార్గం? రాత్రివేళ సీసీ కెమెరాలు ఆఫ్..? సాలూర చెక్‌పోస్ట్‌పై ఆరోపణలు..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర చెక్‌పోస్ట్ వద్ద రాత్రి నిర్లక్ష్యం..? సీసీ కెమెరాలు ఆఫ్ అన్న ఆరోపణలు..


తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని సాలూర చెక్‌పోస్ట్ వద్ద రాత్రి సమయంలో నిర్లక్ష్యం నెలకొన్నట్లు కనిపిస్తోంది. తాజాగా బయటకు వచ్చిన చిత్రాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ఒక ఫోటోలో చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు వెళ్లిపోతున్నా, కౌంటర్ వద్ద ఎలాంటి సిబ్బంది కనిపించకపోవడం గమనార్హం. మరో ఫోటోలో చెక్‌పోస్ట్ కార్యాలయం వెలుతురు ఉన్నప్పటికీ, అక్కడ విధుల్లో ఎవరూ లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

స్థానికుల ఆరోపణల ప్రకారం, ఇదే సమయంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని, ఆ సమయంలోనే సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెబుతున్నారు.
👉 దీంతో అక్రమ ఇసుక రవాణాకు మరింత సులభంగా మారుతోందని ప్రజలు అంటున్నారు.
అలాగే అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. వాస్తవ పరిస్థితి ఏమిటి? సీసీ కెమెరాలు నిజంగా ఆఫ్ అవుతున్నాయా? అనే విషయంపై సంబంధిత శాఖలు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more

1. గుట్కాపై చీత ఫోర్స్ దాడులు 2. మహారాణా ప్రతాప్ జయంతి ఘనంగా 3. ఉపాధి కోసం వెళ్ళిన వారిపై అప్రమత్తత 4. ఈత చెట్లు విధ్వంసంపై గీత కార్మికుల ఆవేదన 5. రైతు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ 6. “మన ఊరు – మన భద్రత” అవగాహన కార్యక్రమం

Read more