మధ్యాహ్నం నుంచే పెద్ద మొత్తాల్లో పేకాట
పోలీసుల చర్యలపై గ్రామస్థుల ప్రశ్నలు…

నిజామాబాద్ జిల్లా మోస్ర మరియు బోధన్ మండలాల్లో పేకాట దందా మళ్లీ జోరందుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మోస్ర మండలంలోని కొత్తపేట గ్రామ పరిసర అడవుల్లోని గుట్టల వద్ద, అలాగే బోధన్ మండలంలోని ఉప్పల్లిపల్లి గ్రామ పంట శివారులో రహస్యంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ జూదం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకుని పెద్ద మొత్తాల్లో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. అడవులు, పంట శివారులను కేంద్రంగా చేసుకుని ఈ దందా సాగుతుండటం గమనార్హం.
ఇలా అక్రమంగా పేకాట నిర్వహణ కొనసాగుతుండటంతో స్థానికంగా శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యువత జూదానికి అలవాటు పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
అధికారుల దృష్టికి ఈ విషయం పలుమార్లు తీసుకెళ్లినా ఇంకా కఠిన చర్యలు కనిపించడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులు స్పందించి పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి ఈ దందాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








