-- --

# కవితక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపడమే మా లక్ష్యం…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

### బోధన్ టీఆర్ఎస్ నూతన పట్టణ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ వెల్లడి..

బోధన్, నవంబర్ 28:

బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కవితక్కను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపడమే తమ ప్రధాన లక్ష్యమని టీఆర్ఎస్ పార్టీ బోధన్ పట్టణ నూతన అధ్యక్షుడు గంగాధర్ గౌడ్ వెల్లడించారు. బోధన్ పట్టణంలో నిర్వహించిన పార్టీ పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తనకు బోధన్ పట్టణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్కతో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులకు గంగాధర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు బోధన్ పట్టణ కమిటీతో పాటు పట్టణంలోని 38 వార్డుల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. త్వరలోనే ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీ సెల్ కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

గతంలో తెలంగాణ ఉద్యమంలో తాను క్రియాశీలకంగా పనిచేశానని, ఆ సమయంలో పలు అక్రమ కేసులను ఎదుర్కొన్నామని, అనేక అవమానాలను భరించినప్పటికీ వెనుకడుగు వేయకుండా నిలబడ్డామని గంగాధర్ గౌడ్ గుర్తుచేశారు.

బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేస్తూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ అలీమ్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతు ప్రవీణ్, టీఆర్ఎస్ రక్షణ సేన విద్యార్థి విభాగానికి చెందిన వడ్ల సతీష్, పార్టీ సీనియర్ నాయకులు హరి, ఉప్పుల జగన్, మైనారిటీ యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more