-- --

ప్రజాసేవే లక్ష్యంగా.. ప్రజల మధ్యే ముషీర్ బాబా! వార్డు 34 అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ప్రజాసేవే లక్ష్యంగా.. ప్రజల మధ్యే ముషీర్ బాబా! వార్డు 34 అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి..

వార్డు నంబర్ 34లో బీఆర్ఎస్ కౌన్సిలర్ షేక్ ముషీర్ బాబా ఆధ్వర్యంలో ఈరోజు ఇంద్రమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధి అంటే ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించేవారు కాకుండా, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని ముషీర్ బాబా నిరూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, అవసరమైనప్పుడు క్యాంపులు నిర్వహించి సేవలను ప్రజల వద్దకే తీసుకురావడం ఆయన ప్రత్యేకత అని తెలిపారు.

ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించడం అభినందనీయమన్నారు. వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న షేక్ ముషీర్ బాబా పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more