-- --

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం..

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

 

బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలి…

బోధన్, నవంబర్ 28:

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని అరికట్టేందుకు అమలులో ఉన్న చట్టాలపై బోధన్ పట్టణంలోని మెప్మా కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిషేధ చట్టం–2006తో పాటు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షల నిషేధం గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో పద్మాసింగ్ మాట్లాడుతూ.. బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండిన తర్వాతే వివాహాలు జరిపించాలని సూచించారు. నిర్ణీత వయస్సు కంటే ముందే వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.

అలాగే గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం చట్టవిరుద్ధమని, ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా ఆడ, మగ అనే తేడా లేకుండా సమానంగా చూడాలని వివరించారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాల్య వివాహాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు లలిత, షబానా, సురేఖ, స్వరూప, టీఎంసీ శ్రీనివాస్‌తో పాటు వార్డుల్లోని వివిధ సమాఖ్యల అధ్యక్షురాళ్లు పాల్గొన్నారు.

వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more