కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, బిల్లా రామ్మోహన్, నాగేశ్వరరావు, పద్మ శరత్ రెడ్డిలలో ఎవరికి అవకాశం? కుటుంబ సభ్యుల పేరుపైనా చర్చ!
బోధన్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి చేసిన ప్రకటనతో బోధన్ కాంగ్రెస్‌లో రాజకీయ చర్చకు తెరలేచింది. ఆయన నిర్ణయం అమలైతే కాంగ్రెస్ తదుపరి అభ్యర్థి ఎవరనే ప్రశ్న స్థానికంగా ఆసక్తి రేపుతోంది. కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, బిల్లా రామ్మోహన్, నాగేశ్వరరావు, పద్మ శరత్ రెడ్డితోపాటు సుదర్శన్ రెడ్డి కుమార్తె పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరికి పార్టీ అధిష్ఠానం అవకాశం కల్పిస్తుంది? సుదర్శన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? బోధన్ కాంగ్రెస్ రాజకీయాల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అనేది వేచి చూడాల్సి ఉంది.
గమనిక: ఆశావహుల పేర్లు స్థానికంగా వినిపిస్తున్న చర్చల ఆధారంగా మాత్రమే ప్రస్తావించబడ్డాయి. అధికారిక ప్రకటన వెలువడలేదు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








