నలుగురు వ్యక్తుల ప్రమేయంపై ఆరోపణలు.. రాజకీయ అండదండలు, జర్నలిస్టు ముసుగులో నిర్వాహకుడి పాత్రపై అనుమానాలు!..
నిజామాబాద్ జిల్లా: నవీపేట మండలం ఫకీరాబాద్ సమీపంలోని గుట్ట ప్రాంతంలో లక్షల రూపాయల పేకాట దందా కొనసాగుతోందన్న సమాచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఫకీరాబాద్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు స్థానిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కవరింగ్ బాయ్‌లను ఏర్పాటు చేసి జూదం కార్యకలాపాలను గోప్యంగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారంతో పాటు, ఈ నలుగురిలో ఒకరు జర్నలిస్టుగా పరిచయం చేసుకుంటూ నిర్వాహకుడి పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్లిందా? రాజకీయ పలుకుబడి పేరుతో జూదం దందా కొనసాగుతోందా? జర్నలిస్టు ముసుగులో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల్లో వాస్తవమెంత? సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిజానిజాలను వెల్లడించాలి. ఆరోపణలు నిర్ధారణ కాకముందే ఎవరినీ దోషులుగా పరిగణించకుండా, సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకుని చట్టప్రకారం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








